Zephaniah 3:16
ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;
Zephaniah 3:16 in Other Translations
King James Version (KJV)
In that day it shall be said to Jerusalem, Fear thou not: and to Zion, Let not thine hands be slack.
American Standard Version (ASV)
In that day it shall be said to Jerusalem, Fear thou not; O Zion, let not thy hands be slack.
Bible in Basic English (BBE)
In that day it will be said to Jerusalem, Have no fear: O Zion, let not your hands be feeble.
Darby English Bible (DBY)
In that day it shall be said to Jerusalem, Fear not; Zion, let not thy hands be slack.
World English Bible (WEB)
In that day, it will be said to Jerusalem, "Don't be afraid, Zion. Don't let your hands be slack."
Young's Literal Translation (YLT)
In that day it is said to Jerusalem, `Fear not, O Zion, let not thy hands be feeble.
| In that | בַּיּ֣וֹם | bayyôm | BA-yome |
| day | הַה֔וּא | hahûʾ | ha-HOO |
| said be shall it | יֵאָמֵ֥ר | yēʾāmēr | yay-ah-MARE |
| to Jerusalem, | לִירֽוּשָׁלִַ֖ם | lîrûšālaim | lee-roo-sha-la-EEM |
| Fear | אַל | ʾal | al |
| not: thou | תִּירָ֑אִי | tîrāʾî | tee-RA-ee |
| and to Zion, | צִיּ֖וֹן | ṣiyyôn | TSEE-yone |
| not Let | אַל | ʾal | al |
| thine hands | יִרְפּ֥וּ | yirpû | yeer-POO |
| be slack. | יָדָֽיִךְ׃ | yādāyik | ya-DA-yeek |
Cross Reference
హెబ్రీయులకు 12:12
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
యెషయా గ్రంథము 35:3
సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
ప్రకటన గ్రంథము 2:3
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
హెబ్రీయులకు 12:3
మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
ఎఫెసీయులకు 3:13
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.
గలతీయులకు 6:9
మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
2 కొరింథీయులకు 4:1
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
యోహాను సువార్త 12:12
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని
జెకర్యా 8:15
ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.
హగ్గయి 2:4
అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగాజెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.
యిర్మీయా 46:27
నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు చున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
యెషయా గ్రంథము 54:4
భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
యెషయా గ్రంథము 44:2
నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
యెషయా గ్రంథము 43:1
అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
యెషయా గ్రంథము 41:13
నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
యెషయా గ్రంథము 41:10
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
యెషయా గ్రంథము 40:9
సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
యోబు గ్రంథము 4:3
అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.