జెకర్యా 12:2 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ జెకర్యా జెకర్యా 12 జెకర్యా 12:2

Zechariah 12:2
నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రు వులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

Zechariah 12:1Zechariah 12Zechariah 12:3

Zechariah 12:2 in Other Translations

King James Version (KJV)
Behold, I will make Jerusalem a cup of trembling unto all the people round about, when they shall be in the siege both against Judah and against Jerusalem.

American Standard Version (ASV)
behold, I will make Jerusalem a cup of reeling unto all the peoples round about, and upon Judah also shall it be in the siege against Jerusalem.

Bible in Basic English (BBE)
See, I will make Jerusalem a cup of shaking fear to all the peoples round about, when Jerusalem is shut in.

Darby English Bible (DBY)
Behold, I will make Jerusalem a cup of bewilderment unto all the peoples round about, and also against Judah shall it be in the siege against Jerusalem.

World English Bible (WEB)
"Behold, I will make Jerusalem a cup of reeling to all the surrounding peoples, and on Judah also will it be in the siege against Jerusalem.

Young's Literal Translation (YLT)
Lo, I am making Jerusalem a cup of reeling To all the peoples round about, And also against Judah it is, In the siege against Jerusalem.

Behold,
הִנֵּ֣הhinnēhee-NAY
I
אָ֠נֹכִיʾānōkîAH-noh-hee
will
make
שָׂ֣םśāmsahm

אֶתʾetet
Jerusalem
יְרוּשָׁלִַ֧םyĕrûšālaimyeh-roo-sha-la-EEM
cup
a
סַףsapsahf
of
trembling
רַ֛עַלraʿalRA-al
unto
all
לְכָלlĕkālleh-HAHL
the
people
הָעַמִּ֖יםhāʿammîmha-ah-MEEM
about,
round
סָבִ֑יבsābîbsa-VEEV
when
they
shall
be
וְגַ֧םwĕgamveh-ɡAHM
siege
the
in
עַלʿalal
both
יְהוּדָ֛הyĕhûdâyeh-hoo-DA
against
יִֽהְיֶ֥הyihĕyeyee-heh-YEH
Judah
בַמָּצ֖וֹרbammāṣôrva-ma-TSORE
and
against
עַלʿalal
Jerusalem.
יְרוּשָׁלִָֽם׃yĕrûšāloimyeh-roo-sha-loh-EEM

Cross Reference

జెకర్యా 14:14
యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.

యెషయా గ్రంథము 51:22
నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.

కీర్తనల గ్రంథము 75:8
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.

యెషయా గ్రంథము 51:17
యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

ప్రకటన గ్రంథము 18:6
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

ప్రకటన గ్రంథము 16:19
ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.

ప్రకటన గ్రంథము 14:10
ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

హబక్కూకు 2:16
​ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.

యిర్మీయా 51:57
దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

యిర్మీయా 51:7
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.

యిర్మీయా 49:12
​యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.

యిర్మీయా 25:17
అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.

యిర్మీయా 25:15
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెల విచ్చుచున్నాడునీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనము లన్నిటికి దాని త్రాగింపుము.

యిర్మీయా 8:14
​మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్క డనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.