రోమీయులకు 13:9
ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
For | τὸ | to | toh |
this, | γὰρ | gar | gahr |
Thou shalt not commit | Οὐ | ou | oo |
adultery, | μοιχεύσεις | moicheuseis | moo-HAYF-sees |
Thou shalt not | Οὐ | ou | oo |
kill, | φονεύσεις | phoneuseis | foh-NAYF-sees |
not shalt Thou | Οὐ | ou | oo |
steal, | κλέψεις | klepseis | KLAY-psees |
false bear not shalt Thou | Οὐ | ou | oo |
witness, | ψευδομαρτυρήσεις, | pseudomartyrēseis | psave-thoh-mahr-tyoo-RAY-sees |
Thou shalt not | Οὐκ | ouk | ook |
covet; | ἐπιθυμήσεις | epithymēseis | ay-pee-thyoo-MAY-sees |
and | καὶ | kai | kay |
if | εἴ | ei | ee |
there be any | τις | tis | tees |
other | ἑτέρα | hetera | ay-TAY-ra |
commandment, | ἐντολή | entolē | ane-toh-LAY |
comprehended briefly is it | ἐν | en | ane |
in | τούτῳ | toutō | TOO-toh |
this | τῷ | tō | toh |
λόγῳ | logō | LOH-goh | |
saying, | ἀνακεφαλαιοῦται, | anakephalaioutai | ah-na-kay-fa-lay-OO-tay |
namely, | ἐν | en | ane |
τῷ | tō | toh | |
love shalt Thou | Ἀγαπήσεις | agapēseis | ah-ga-PAY-sees |
thy | τὸν | ton | tone |
πλησίον | plēsion | play-SEE-one | |
neighbour | σου | sou | soo |
as | ὡς | hōs | ose |
thyself. | ἑαυτόν | heauton | ay-af-TONE |
Cross Reference
లేవీయకాండము 19:18
కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
మత్తయి సువార్త 19:18
యేసునరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము,
నిర్గమకాండము 20:12
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
రోమీయులకు 7:7
కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
లూకా సువార్త 10:27
అతడునీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకము తోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రే
మార్కు సువార్త 12:31
రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
యాకోబు 2:8
మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.
గలతీయులకు 5:13
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.
లూకా సువార్త 18:20
వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను.
మార్కు సువార్త 10:19
నరహత్య చేయవద్దు, వ్యభిచ రింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోస పుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.
మత్తయి సువార్త 22:39
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
ద్వితీయోపదేశకాండమ 5:16
నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
లేవీయకాండము 19:34
మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.