Romans 1:8
మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
Romans 1:8 in Other Translations
King James Version (KJV)
First, I thank my God through Jesus Christ for you all, that your faith is spoken of throughout the whole world.
American Standard Version (ASV)
First, I thank my God through Jesus Christ for you all, that your faith is proclaimed throughout the whole world.
Bible in Basic English (BBE)
First of all, I give praise to my God through Jesus Christ for you all, because news of your faith has gone into all the world.
Darby English Bible (DBY)
First, I thank my God through Jesus Christ for you all, that your faith is proclaimed in the whole world.
World English Bible (WEB)
First, I thank my God through Jesus Christ for all of you, that your faith is proclaimed throughout the whole world.
Young's Literal Translation (YLT)
first, indeed, I thank my God through Jesus Christ for you all, that your faith is proclaimed in the whole world;
| First, | Πρῶτον | prōton | PROH-tone |
| I | μὲν | men | mane |
| thank | εὐχαριστῶ | eucharistō | afe-ha-ree-STOH |
| my | τῷ | tō | toh |
| God | θεῷ | theō | thay-OH |
| through | μου | mou | moo |
| Jesus | διὰ | dia | thee-AH |
| Christ | Ἰησοῦ | iēsou | ee-ay-SOO |
| for | Χριστοῦ | christou | hree-STOO |
| you | ὑπὲρ | hyper | yoo-PARE |
| all, | πάντων | pantōn | PAHN-tone |
| that | ὑμῶν | hymōn | yoo-MONE |
| your | ὅτι | hoti | OH-tee |
| ἡ | hē | ay | |
| faith is spoken | πίστις | pistis | PEE-stees |
| of | ὑμῶν | hymōn | yoo-MONE |
| throughout | καταγγέλλεται | katangelletai | ka-tahng-GALE-lay-tay |
| the | ἐν | en | ane |
| whole | ὅλῳ | holō | OH-loh |
| τῷ | tō | toh | |
| world. | κόσμῳ | kosmō | KOH-smoh |
Cross Reference
రోమీయులకు 16:19
మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
1 కొరింథీయులకు 1:4
క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఫిలిప్పీయులకు 1:3
ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,
రోమీయులకు 6:17
మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
1 పేతురు 4:11
ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.
1 పేతురు 2:5
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
హెబ్రీయులకు 13:15
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
1 థెస్సలొనీకయులకు 1:8
అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
కొలొస్సయులకు 1:3
పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
ఫిలిప్పీయులకు 1:11
వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
ఎఫెసీయులకు 5:20
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
ఎఫెసీయులకు 3:21
క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
ఎఫెసీయులకు 1:15
ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాస మునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి
అపొస్తలుల కార్యములు 11:28
వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
లూకా సువార్త 2:1
ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
మత్తయి సువార్త 24:14
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును.