Psalm 96:4
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
Psalm 96:4 in Other Translations
King James Version (KJV)
For the LORD is great, and greatly to be praised: he is to be feared above all gods.
American Standard Version (ASV)
For great is Jehovah, and greatly to be praised: He is to be feared above all gods.
Bible in Basic English (BBE)
For the Lord is great, and greatly to be praised; he is more to be feared than all other gods.
Darby English Bible (DBY)
For Jehovah is great and exceedingly to be praised; he is terrible above all gods.
World English Bible (WEB)
For great is Yahweh, and greatly to be praised! He is to be feared above all gods.
Young's Literal Translation (YLT)
For great `is' Jehovah, and praised greatly, Fearful He `is' over all gods.
| For | כִּ֥י | kî | kee |
| the Lord | גָ֘ד֤וֹל | gādôl | ɡA-DOLE |
| is great, | יְהוָ֣ה | yĕhwâ | yeh-VA |
| and greatly | וּמְהֻלָּ֣ל | ûmĕhullāl | oo-meh-hoo-LAHL |
| praised: be to | מְאֹ֑ד | mĕʾōd | meh-ODE |
| he | נוֹרָ֥א | nôrāʾ | noh-RA |
| is to be feared | ה֝֗וּא | hûʾ | hoo |
| above | עַל | ʿal | al |
| all | כָּל | kāl | kahl |
| gods. | אֱלֹהִֽים׃ | ʾĕlōhîm | ay-loh-HEEM |
Cross Reference
కీర్తనల గ్రంథము 18:3
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.
కీర్తనల గ్రంథము 89:7
పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
కీర్తనల గ్రంథము 95:3
యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
కీర్తనల గ్రంథము 145:3
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
ప్రకటన గ్రంథము 15:4
ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
లూకా సువార్త 12:5
ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయ పడుడని మీతో చెప్పుచున్నాను.
యిర్మీయా 10:6
యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను.
యిర్మీయా 5:22
సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.
కీర్తనల గ్రంథము 86:10
నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు
కీర్తనల గ్రంథము 76:7
నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
కీర్తనల గ్రంథము 66:5
దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
కీర్తనల గ్రంథము 66:3
ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు
కీర్తనల గ్రంథము 48:1
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.
నెహెమ్యా 9:5
అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరిసకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.
సమూయేలు మొదటి గ్రంథము 4:8
అయ్యయ్యో మహాశూరు డగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింప గలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.
నిర్గమకాండము 18:11
ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.