కీర్తనల గ్రంథము 89:4 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 89 కీర్తనల గ్రంథము 89:4

Psalm 89:4
తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)

Psalm 89:3Psalm 89Psalm 89:5

Psalm 89:4 in Other Translations

King James Version (KJV)
Thy seed will I establish for ever, and build up thy throne to all generations. Selah.

American Standard Version (ASV)
Thy seed will I establish for ever, And build up thy throne to all generations. Selah

Bible in Basic English (BBE)
I will make your seed go on for ever, your kingdom will be strong through all generations. (Selah.)

Darby English Bible (DBY)
Thy seed will I establish for ever, and build up thy throne from generation to generation. Selah.

Webster's Bible (WBT)
I have made a covenant with my chosen, I have sworn to David my servant,

World English Bible (WEB)
'I will establish your seed forever, And build up your throne to all generations.'" Selah.

Young's Literal Translation (YLT)
`Even to the age do I establish thy seed, And have built to generation and generation thy throne. Selah.

Thy
seed
עַדʿadad
will
I
establish
ע֭וֹלָםʿôlomOH-lome
for
אָכִ֣יןʾākînah-HEEN
ever,
זַרְעֶ֑ךָzarʿekāzahr-EH-ha
up
build
and
וּבָנִ֨יתִיûbānîtîoo-va-NEE-tee
thy
throne
לְדֹרlĕdōrleh-DORE
to
all
וָד֖וֹרwādôrva-DORE
generations.
כִּסְאֲךָ֣kisʾăkākees-uh-HA
Selah.
סֶֽלָה׃selâSEH-la

Cross Reference

సమూయేలు రెండవ గ్రంథము 7:12
నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

లూకా సువార్త 1:32
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

యెషయా గ్రంథము 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

కీర్తనల గ్రంథము 132:12
యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:10
​​అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:10
నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాకయెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.

ప్రకటన గ్రంథము 22:16
సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.

ఫిలిప్పీయులకు 2:9
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

రోమీయులకు 15:12
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.

రోమీయులకు 1:3
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక,

అపొస్తలుల కార్యములు 13:32
దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.

లూకా సువార్త 20:41
ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జను లేలాగు చెప్పుచున్నారు

జెకర్యా 12:8
ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

కీర్తనల గ్రంథము 89:36
చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు

కీర్తనల గ్రంథము 89:29
శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

కీర్తనల గ్రంథము 89:1
యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

కీర్తనల గ్రంథము 72:17
అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

రాజులు మొదటి గ్రంథము 9:5
నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.

సమూయేలు రెండవ గ్రంథము 7:29
​దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వ దించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.