Psalm 44:14
అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
Psalm 44:14 in Other Translations
King James Version (KJV)
Thou makest us a byword among the heathen, a shaking of the head among the people.
American Standard Version (ASV)
Thou makest us a byword among the nations, A shaking of the head among the peoples.
Bible in Basic English (BBE)
Our name is a word of shame among the nations, a sign for the shaking of heads among the peoples.
Darby English Bible (DBY)
Thou makest us a byword among the nations, a shaking of the head among the peoples.
Webster's Bible (WBT)
Thou makest us a reproach to our neighbors, a scorn and a derision to them that are around us.
World English Bible (WEB)
You make us a byword among the nations, A shaking of the head among the peoples.
Young's Literal Translation (YLT)
Thou makest us a simile among nations, A shaking of the head among peoples.
| Thou makest | תְּשִׂימֵ֣נוּ | tĕśîmēnû | teh-see-MAY-noo |
| us a byword | מָ֭שָׁל | māšol | MA-shole |
| among the heathen, | בַּגּוֹיִ֑ם | baggôyim | ba-ɡoh-YEEM |
| shaking a | מְנֽוֹד | mĕnôd | meh-NODE |
| of the head | רֹ֝֗אשׁ | rōš | rohsh |
| among the people. | בַּלְאֻמִּֽים׃ | balʾummîm | bahl-oo-MEEM |
Cross Reference
యిర్మీయా 24:9
మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదము గాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
యోబు గ్రంథము 16:4
నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును.నేనును మీమీద మాటలు కల్పింపవచ్చునుమీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.
రాజులు రెండవ గ్రంథము 19:21
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
విలాపవాక్యములు 2:15
త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
యెషయా గ్రంథము 37:22
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయు చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
కీర్తనల గ్రంథము 109:25
వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
కీర్తనల గ్రంథము 22:7
నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.
యోబు గ్రంథము 17:6
ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 7:20
నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.
రాజులు మొదటి గ్రంథము 9:7
నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశ ములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
ద్వితీయోపదేశకాండమ 28:37
యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.