Psalm 132:5
నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
Psalm 132:5 in Other Translations
King James Version (KJV)
Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.
American Standard Version (ASV)
Until I find out a place for Jehovah, A tabernacle for the Mighty One of Jacob.
Bible in Basic English (BBE)
Till I have got a place for the Lord, a resting-place for the great God of Jacob.
Darby English Bible (DBY)
Until I find out a place for Jehovah, habitations for the Mighty One of Jacob. ...
World English Bible (WEB)
Until I find out a place for Yahweh, A dwelling for the Mighty One of Jacob."
Young's Literal Translation (YLT)
Till I do find a place for Jehovah, Tabernacles for the Mighty One of Jacob.
| Until | עַד | ʿad | ad |
| I find out | אֶמְצָ֣א | ʾemṣāʾ | em-TSA |
| a place | מָ֭קוֹם | māqôm | MA-kome |
| Lord, the for | לַיהוָ֑ה | layhwâ | lai-VA |
| an habitation | מִ֝שְׁכָּנ֗וֹת | miškānôt | MEESH-ka-NOTE |
| for the mighty | לַאֲבִ֥יר | laʾăbîr | la-uh-VEER |
| God of Jacob. | יַעֲקֹֽב׃ | yaʿăqōb | ya-uh-KOVE |
Cross Reference
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా
ఎఫెసీయులకు 2:22
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
సమూయేలు రెండవ గ్రంథము 6:17
వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.
రాజులు మొదటి గ్రంథము 8:27
నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:3
అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:12
లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2:6
ఆకాశ ములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయ నకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.
యెషయా గ్రంథము 66:1
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?
అపొస్తలుల కార్యములు 7:46
అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.