మత్తయి సువార్త 26:31
అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగాగొఱ్ఱల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
Then | Τότε | tote | TOH-tay |
saith | λέγει | legei | LAY-gee |
αὐτοῖς | autois | af-TOOS | |
Jesus | ὁ | ho | oh |
unto them, | Ἰησοῦς | iēsous | ee-ay-SOOS |
All | Πάντες | pantes | PAHN-tase |
ye | ὑμεῖς | hymeis | yoo-MEES |
offended be shall | σκανδαλισθήσεσθε | skandalisthēsesthe | skahn-tha-lee-STHAY-say-sthay |
because of | ἐν | en | ane |
me | ἐμοὶ | emoi | ay-MOO |
ἐν | en | ane | |
this | τῇ | tē | tay |
νυκτὶ | nykti | nyook-TEE | |
night: | ταύτῃ· | tautē | TAF-tay |
for | γέγραπται | gegraptai | GAY-gra-ptay |
it is written, | γάρ, | gar | gahr |
I will smite | Πατάξω | pataxō | pa-TA-ksoh |
the | τὸν | ton | tone |
shepherd, | ποιμένα | poimena | poo-MAY-na |
and | καὶ | kai | kay |
the | διασκορπισθήσεται | diaskorpisthēsetai | thee-ah-skore-pee-STHAY-say-tay |
sheep | τὰ | ta | ta |
of the | πρόβατα | probata | PROH-va-ta |
flock | τῆς | tēs | tase |
shall be scattered abroad. | ποίμνης | poimnēs | POOM-nase |
Cross Reference
జెకర్యా 13:7
ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.
యోహాను సువార్త 16:32
యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.
మార్కు సువార్త 14:27
అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱల కాపరిని కొట్టుదును; గొఱ్ఱలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా.
మత్తయి సువార్త 11:6
మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.
యెహెజ్కేలు 34:5
కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
కీర్తనల గ్రంథము 88:18
నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
మత్తయి సువార్త 24:9
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
విలాపవాక్యములు 1:19
నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.
యెషయా గ్రంథము 53:10
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
కీర్తనల గ్రంథము 69:20
నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.
కీర్తనల గ్రంథము 38:11
నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
యోబు గ్రంథము 19:13
ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడునా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
యోబు గ్రంథము 6:15
నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
మత్తయి సువార్త 26:56
అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరు నట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యు లందరు ఆయనను విడిచి పారిపోయిరి.
లూకా సువార్త 22:31
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని