లూకా సువార్త 5:26
అందరును విస్మయమొందినేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.
And | καὶ | kai | kay |
they were all | ἔκστασις | ekstasis | AKE-sta-sees |
amazed, | ἔλαβεν | elaben | A-la-vane |
ἅπαντας | hapantas | A-pahn-tahs | |
and | καὶ | kai | kay |
they glorified | ἐδόξαζον | edoxazon | ay-THOH-ksa-zone |
τὸν | ton | tone | |
God, | θεόν | theon | thay-ONE |
and | καὶ | kai | kay |
filled were | ἐπλήσθησαν | eplēsthēsan | ay-PLAY-sthay-sahn |
with fear, | φόβου | phobou | FOH-voo |
saying, | λέγοντες | legontes | LAY-gone-tase |
seen have We | ὅτι | hoti | OH-tee |
strange things | Εἴδομεν | eidomen | EE-thoh-mane |
to day. | παράδοξα | paradoxa | pa-RA-thoh-ksa |
σήμερον | sēmeron | SAY-may-rone |
Cross Reference
మత్తయి సువార్త 9:8
జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
లూకా సువార్త 7:16
అందరు భయాక్రాంతులైమనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
గలతీయులకు 1:24
వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
అపొస్తలుల కార్యములు 5:11
సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.
అపొస్తలుల కార్యములు 4:21
ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
లూకా సువార్త 8:37
గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
లూకా సువార్త 5:8
సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడిప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
మార్కు సువార్త 2:12
తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
మత్తయి సువార్త 28:8
వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
మత్తయి సువార్త 12:23
అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
హొషేయ 3:5
తరు వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచా రణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
యిర్మీయా 33:9
భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.