విలాపవాక్యములు 5:16 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ విలాపవాక్యములు విలాపవాక్యములు 5 విలాపవాక్యములు 5:16

Lamentations 5:16
మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.

Lamentations 5:15Lamentations 5Lamentations 5:17

Lamentations 5:16 in Other Translations

King James Version (KJV)
The crown is fallen from our head: woe unto us, that we have sinned!

American Standard Version (ASV)
The crown is fallen from our head: Woe unto us! for we have sinned.

Bible in Basic English (BBE)
The crown has been taken from our head: sorrow is ours, for we are sinners.

Darby English Bible (DBY)
The crown is fallen from our head: woe unto us, for we have sinned!

World English Bible (WEB)
The crown is fallen from our head: Woe to us! for we have sinned.

Young's Literal Translation (YLT)
Fallen hath the crown `from' our head, Wo `is' now to us, for we have sinned.

The
crown
נָֽפְלָה֙nāpĕlāhna-feh-LA
is
fallen
עֲטֶ֣רֶתʿăṭeretuh-TEH-ret
from
our
head:
רֹאשֵׁ֔נוּrōʾšēnûroh-SHAY-noo
woe
אֽוֹיʾôyoy
unto
us,
that
נָ֥אnāʾna
we
have
sinned!
לָ֖נוּlānûLA-noo
כִּ֥יkee
חָטָֽאנוּ׃ḥāṭāʾnûha-TA-noo

Cross Reference

కీర్తనల గ్రంథము 89:39
నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.

యిర్మీయా 13:18
రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుముమీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.

యెషయా గ్రంథము 3:9
వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ

విలాపవాక్యములు 1:1
జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

యోబు గ్రంథము 19:9
ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడుతలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

ప్రకటన గ్రంథము 3:11
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

ప్రకటన గ్రంథము 2:10
ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.

2 పేతురు 2:4
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

యెహెజ్కేలు 22:12
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 21:26
ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.

యెహెజ్కేలు 7:17
​అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.

విలాపవాక్యములు 4:13
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు

విలాపవాక్యములు 2:1
ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.

విలాపవాక్యములు 1:18
యెహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలును నా ¸°వనులును చెరలోనికిపోయి యున్నారు

విలాపవాక్యములు 1:8
యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది

యిర్మీయా 4:18
నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?

యిర్మీయా 2:19
నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.

యిర్మీయా 2:17
నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గ ములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.

సామెతలు 14:34
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.