యెహొషువ 6:2
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.
And the Lord | וַיֹּ֤אמֶר | wayyōʾmer | va-YOH-mer |
said | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
unto | אֶל | ʾel | el |
Joshua, | יְהוֹשֻׁ֔עַ | yĕhôšuaʿ | yeh-hoh-SHOO-ah |
See, | רְאֵה֙ | rĕʾēh | reh-A |
I have given | נָתַ֣תִּי | nātattî | na-TA-tee |
hand thine into | בְיָֽדְךָ֔ | bĕyādĕkā | veh-ya-deh-HA |
אֶת | ʾet | et | |
Jericho, | יְרִיח֖וֹ | yĕrîḥô | yeh-ree-HOH |
and the king | וְאֶת | wĕʾet | veh-ET |
men mighty the and thereof, | מַלְכָּ֑הּ | malkāh | mahl-KA |
of valour. | גִּבּוֹרֵ֖י | gibbôrê | ɡee-boh-RAY |
הֶחָֽיִל׃ | heḥāyil | heh-HA-yeel |
Cross Reference
ద్వితీయోపదేశకాండమ 7:24
ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మను ష్యుడును నీ యెదుట నిలువలేకపోవును.
యెహొషువ 8:1
మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.
యెహొషువ 2:24
మరియు వారుఆ దేశ మంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.
యెహొషువ 2:9
యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
నెహెమ్యా 9:24
ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.
న్యాయాధిపతులు 11:24
స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.
యెహొషువ 11:6
యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్ప గించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను.
యెహొషువ 6:9
యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.
యెహొషువ 5:13
యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లినీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా
దానియేలు 5:18
రాజా చిత్తగించుము; మహోన్నతు డగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘన తను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.
దానియేలు 4:35
భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
దానియేలు 4:17
ఈ ఆజ్ఞ జాగరూకు లగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛ éయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నా డనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.
దానియేలు 2:44
ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
దానియేలు 2:21
ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.
సమూయేలు రెండవ గ్రంథము 5:19
దావీదునేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్దవిచారించినప్పుడుపొమ్ము,నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.
న్యాయాధిపతులు 11:21
అప్పుడు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని