యోబు గ్రంథము 8:3 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 8 యోబు గ్రంథము 8:3

Job 8:3
దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

Job 8:2Job 8Job 8:4

Job 8:3 in Other Translations

King James Version (KJV)
Doth God pervert judgment? or doth the Almighty pervert justice?

American Standard Version (ASV)
Doth God pervert justice? Or doth the Almighty pervert righteousness?

Bible in Basic English (BBE)
Does God give wrong decisions? or is the Ruler of all not upright in his judging?

Darby English Bible (DBY)
Doth ùGod pervert judgment, and the Almighty pervert justice?

Webster's Bible (WBT)
Doth God pervert judgment; or doth the Almighty pervert justice?

World English Bible (WEB)
Does God pervert justice? Or does the Almighty pervert righteousness?

Young's Literal Translation (YLT)
Doth God pervert judgment? And doth the Mighty One pervert justice?

Doth
God
הַ֭אֵלhaʾēlHA-ale
pervert
יְעַוֵּ֣תyĕʿawwētyeh-ah-WATE
judgment?
מִשְׁפָּ֑טmišpāṭmeesh-PAHT
or
וְאִםwĕʾimveh-EEM
Almighty
the
doth
שַׁ֝דַּ֗יšaddaySHA-DAI
pervert
יְעַוֵּֽתyĕʿawwētyeh-ah-WATE
justice?
צֶֽדֶק׃ṣedeqTSEH-dek

Cross Reference

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 19:7
యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

ద్వితీయోపదేశకాండమ 32:4
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

ఆదికాండము 18:25
ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు

యోబు గ్రంథము 34:10
విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

దానియేలు 9:14
మేము మా దేవుడైన యెహోవా మాట విన లేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను.

రోమీయులకు 3:4
నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునునీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.

ప్రకటన గ్రంథము 16:7
అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

ప్రకటన గ్రంథము 15:3
వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;

రోమీయులకు 2:5
నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.

యెహెజ్కేలు 33:20
యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను.

యెహెజ్కేలు 33:17
అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయ మైనది?

యెహెజ్కేలు 18:25
​అయితేయెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?

కీర్తనల గ్రంథము 99:4
యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.

కీర్తనల గ్రంథము 89:14
నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.

యోబు గ్రంథము 9:2
వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

యోబు గ్రంథము 10:3
దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

యోబు గ్రంథము 19:7
నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

యోబు గ్రంథము 21:15
మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

యోబు గ్రంథము 21:20
వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

యోబు గ్రంథము 34:5
నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

యోబు గ్రంథము 34:17
న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?

యోబు గ్రంథము 35:13
నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

యోబు గ్రంథము 40:2
ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్య వలెను.

యోబు గ్రంథము 40:8
నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా?

యోబు గ్రంథము 4:17
తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?