యోబు గ్రంథము 12:15 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 12 యోబు గ్రంథము 12:15

Job 12:15
ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవునువాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

Job 12:14Job 12Job 12:16

Job 12:15 in Other Translations

King James Version (KJV)
Behold, he withholdeth the waters, and they dry up: also he sendeth them out, and they overturn the earth.

American Standard Version (ASV)
Behold, he withholdeth the waters, and they dry up; Again, he sendeth them out, and they overturn the earth.

Bible in Basic English (BBE)
Truly, he keeps back the waters and they are dry; he sends them out and the earth is overturned.

Darby English Bible (DBY)
Behold, he withholdeth the waters, and they dry up; and he sendeth them out, and they overturn the earth.

Webster's Bible (WBT)
Behold, he withholdeth the waters, and they dry up: also he sendeth them out, and they overturn the earth.

World English Bible (WEB)
Behold, he withholds the waters, and they dry up; Again, he sends them out, and they overturn the earth.

Young's Literal Translation (YLT)
Lo, He keepeth in the waters, and they are dried up, And he sendeth them forth, And they overturn the land.

Behold,
הֵ֤ןhēnhane
he
withholdeth
יַעְצֹ֣רyaʿṣōrya-TSORE
the
waters,
בַּמַּ֣יִםbammayimba-MA-yeem
up:
dry
they
and
וְיִבָ֑שׁוּwĕyibāšûveh-yee-VA-shoo
out,
them
sendeth
he
also
וִֽ֝ישַׁלְּחֵ֗םwîšallĕḥēmVEE-sha-leh-HAME
and
they
overturn
וְיַ֖הַפְכוּwĕyahapkûveh-YA-hahf-hoo
the
earth.
אָֽרֶץ׃ʾāreṣAH-rets

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 17:1
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.

ప్రకటన గ్రంథము 11:6
తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

యాకోబు 5:17
ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు.

లూకా సువార్త 4:25
ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,

నహూము 1:4
ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.

ఆమోసు 5:8
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

యిర్మీయా 14:22
​జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.

కీర్తనల గ్రంథము 104:7
నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.

యోబు గ్రంథము 12:10
జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

రాజులు మొదటి గ్రంథము 8:35
మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగున శ్రమపెట్టుటవలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసిన యెడల

ద్వితీయోపదేశకాండమ 11:17
లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.

ఆదికాండము 7:11
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.

ఆదికాండము 6:17
ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;

ఆదికాండము 6:13
దేవుడు నోవహుఱోసమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.