యిర్మీయా 1:6
అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా
Then said | וָאֹמַ֗ר | wāʾōmar | va-oh-MAHR |
I, Ah, | אֲהָהּ֙ | ʾăhāh | uh-HA |
Lord | אֲדֹנָ֣י | ʾădōnāy | uh-doh-NAI |
God! | יְהוִֹ֔ה | yĕhôi | yeh-hoh-EE |
behold, | הִנֵּ֥ה | hinnē | hee-NAY |
cannot I | לֹא | lōʾ | loh |
יָדַ֖עְתִּי | yādaʿtî | ya-DA-tee | |
speak: | דַּבֵּ֑ר | dabbēr | da-BARE |
for | כִּי | kî | kee |
I | נַ֖עַר | naʿar | NA-ar |
am a child. | אָנֹֽכִי׃ | ʾānōkî | ah-NOH-hee |
Cross Reference
నిర్గమకాండము 6:12
అప్పుడు మోషేచిత్తగించుము, ఇశ్రా యేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడ నగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
నిర్గమకాండము 4:10
అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహొ
రాజులు మొదటి గ్రంథము 3:7
నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
యిర్మీయా 32:17
యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
నిర్గమకాండము 4:1
అందుకు మోషేచిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరుయెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
నిర్గమకాండము 6:30
మోషేచిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
యెషయా గ్రంథము 6:5
నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
యిర్మీయా 4:10
అప్పుడు నేనిట్లంటినికటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవుమీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.
యిర్మీయా 14:13
అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా