Isaiah 53:2
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
Isaiah 53:2 in Other Translations
King James Version (KJV)
For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground: he hath no form nor comeliness; and when we shall see him, there is no beauty that we should desire him.
American Standard Version (ASV)
For he grew up before him as a tender plant, and as a root out of a dry ground: he hath no form nor comeliness; and when we see him, there is no beauty that we should desire him.
Bible in Basic English (BBE)
For his growth was like that of a delicate plant before him, and like a root out of a dry place: he had no grace of form, to give us pleasure;
Darby English Bible (DBY)
For he shall grow up before him as a tender sapling, and as a root out of dry ground: he hath no form nor lordliness, and when we see him, there is no beauty that we should desire him.
World English Bible (WEB)
For he grew up before him as a tender plant, and as a root out of a dry ground: he has no form nor comeliness; and when we see him, there is no beauty that we should desire him.
Young's Literal Translation (YLT)
Yea, he cometh up as a tender plant before Him, And as a root out of a dry land, He hath no form, nor honour, when we observe him, Nor appearance, when we desire him.
| For he shall grow up | וַיַּ֨עַל | wayyaʿal | va-YA-al |
| before | כַּיּוֹנֵ֜ק | kayyônēq | ka-yoh-NAKE |
| plant, tender a as him | לְפָנָ֗יו | lĕpānāyw | leh-fa-NAV |
| and as a root | וְכַשֹּׁ֙רֶשׁ֙ | wĕkaššōreš | veh-ha-SHOH-RESH |
| dry a of out | מֵאֶ֣רֶץ | mēʾereṣ | may-EH-rets |
| ground: | צִיָּ֔ה | ṣiyyâ | tsee-YA |
| no hath he | לֹא | lōʾ | loh |
| form | תֹ֥אַר | tōʾar | TOH-ar |
| nor | ל֖וֹ | lô | loh |
| comeliness; | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
| see shall we when and | הָדָ֑ר | hādār | ha-DAHR |
| no is there him, | וְנִרְאֵ֥הוּ | wĕnirʾēhû | veh-neer-A-hoo |
| beauty | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
| that we should desire | מַרְאֶ֖ה | marʾe | mahr-EH |
| him. | וְנֶחְמְדֵֽהוּ׃ | wĕneḥmĕdēhû | veh-nek-meh-day-HOO |
Cross Reference
యెషయా గ్రంథము 52:14
నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ మును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ
ఫిలిప్పీయులకు 2:6
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
యెషయా గ్రంథము 11:1
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
మార్కు సువార్త 6:3
ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
1 పేతురు 2:14
రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.
రోమీయులకు 8:3
శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము
యోహాను సువార్త 9:28
అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
యోహాను సువార్త 19:14
ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
యోహాను సువార్త 19:5
ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతుఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.
యోహాను సువార్త 18:40
అయితే వారువీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
యోహాను సువార్త 1:10
ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.
లూకా సువార్త 9:58
అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
లూకా సువార్త 2:51
అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను.
లూకా సువార్త 2:39
అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.
లూకా సువార్త 2:7
తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
మార్కు సువార్త 9:12
అందుకాయనఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
జెకర్యా 6:12
అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
యెహెజ్కేలు 17:22
మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటు దును.
యిర్మీయా 23:5
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.