యెషయా గ్రంథము 26:12 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెషయా గ్రంథము యెషయా గ్రంథము 26 యెషయా గ్రంథము 26:12

Isaiah 26:12
యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.

Isaiah 26:11Isaiah 26Isaiah 26:13

Isaiah 26:12 in Other Translations

King James Version (KJV)
LORD, thou wilt ordain peace for us: for thou also hast wrought all our works in us.

American Standard Version (ASV)
Jehovah, thou wilt ordain peace for us; for thou hast also wrought all our works for us.

Bible in Basic English (BBE)
Lord, you will give us peace: for all our works are the outcome of your purpose.

Darby English Bible (DBY)
Jehovah, thou wilt ordain peace for us; for thou also hast wrought all our works for us.

World English Bible (WEB)
Yahweh, you will ordain peace for us; for you have also worked all our works for us.

Young's Literal Translation (YLT)
O Jehovah, Thou appointest peace to us, For, all our works also Thou hast wrought for us.

Lord,
יְהוָ֕הyĕhwâyeh-VA
thou
wilt
ordain
תִּשְׁפֹּ֥תtišpōtteesh-POTE
peace
שָׁל֖וֹםšālômsha-LOME
for
us:
for
לָ֑נוּlānûLA-noo
also
thou
כִּ֛יkee
hast
wrought
גַּ֥םgamɡahm
all
כָּֽלkālkahl
our
works
מַעֲשֵׂ֖ינוּmaʿăśênûma-uh-SAY-noo
in
us.
פָּעַ֥לְתָּpāʿaltāpa-AL-ta
לָּֽנוּ׃lānûla-NOO

Cross Reference

ద్వితీయోపదేశకాండమ 30:6
​మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను, నీ దేవుడైన యెహో వాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృద యమునకును సున్నతి చేయును.

హెబ్రీయులకు 13:20
గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,

ఎఫెసీయులకు 2:10
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

యోహాను సువార్త 14:27
శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

యెహెజ్కేలు 36:25
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.

యెహెజ్కేలు 20:22
అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.

యెహెజ్కేలు 20:14
అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

యెహెజ్కేలు 20:9
అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.

యిర్మీయా 33:6
నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

యెషయా గ్రంథము 57:10
నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

కీర్తనల గ్రంథము 57:2
మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

కీర్తనల గ్రంథము 29:11
యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.