హొషేయ 7:10 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ హొషేయ హొషేయ 7 హొషేయ 7:10

Hosea 7:10
ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.

Hosea 7:9Hosea 7Hosea 7:11

Hosea 7:10 in Other Translations

King James Version (KJV)
And the pride of Israel testifieth to his face: and they do not return to the LORD their God, nor seek him for all this.

American Standard Version (ASV)
And the pride of Israel doth testify to his face: yet they have not returned unto Jehovah their God, nor sought him, for all this.

Bible in Basic English (BBE)
And the pride of Israel gives an answer to his face; but for all this, they have not gone back to the Lord their God, or made search for him.

Darby English Bible (DBY)
And the pride of Israel testifieth to his face; and they do not return to Jehovah their God, nor seek him for all this.

World English Bible (WEB)
The pride of Israel testifies to his face; Yet they haven't returned to Yahweh their God, Nor sought him, for all this.

Young's Literal Translation (YLT)
And humbled hath been the excellency of Israel to his face, And they have not turned back unto Jehovah their God, Nor have they sought Him for all this.

And
the
pride
וְעָנָ֥הwĕʿānâveh-ah-NA
of
Israel
גְאֽוֹןgĕʾônɡeh-ONE
testifieth
יִשְׂרָאֵ֖לyiśrāʾēlyees-ra-ALE
to
his
face:
בְּפָנָ֑יוbĕpānāywbeh-fa-NAV
not
do
they
and
וְלֹֽאwĕlōʾveh-LOH
return
שָׁ֙בוּ֙šābûSHA-VOO
to
אֶלʾelel
the
Lord
יְהוָ֣הyĕhwâyeh-VA
God,
their
אֱלֹֽהֵיהֶ֔םʾĕlōhêhemay-loh-hay-HEM
nor
וְלֹ֥אwĕlōʾveh-LOH
seek
בִקְשֻׁ֖הוּbiqšuhûveek-SHOO-hoo
him
for
all
בְּכָלbĕkālbeh-HAHL
this.
זֹֽאת׃zōtzote

Cross Reference

హొషేయ 5:5
ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రా యిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లు చున్నారు.

యెషయా గ్రంథము 9:13
అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

ఆమోసు 4:6
మీ పట్టణములన్నిటి లోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

రోమీయులకు 3:11
గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

జెకర్యా 1:4
మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలుసైన్యములకు అధి పతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రక టించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

హొషేయ 7:7
పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.

హొషేయ 6:1
మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

యిర్మీయా 35:15
మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటిం చితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి

యిర్మీయా 25:5
మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై,

యిర్మీయా 8:5
యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు?

యిర్మీయా 3:3
కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.

సామెతలు 27:22
మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.

కీర్తనల గ్రంథము 53:2
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

కీర్తనల గ్రంథము 14:2
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను

కీర్తనల గ్రంథము 10:4
దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురుదేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు