హొషేయ 11:3 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ హొషేయ హొషేయ 11 హొషేయ 11:3

Hosea 11:3
​ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించు కొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు

Hosea 11:2Hosea 11Hosea 11:4

Hosea 11:3 in Other Translations

King James Version (KJV)
I taught Ephraim also to go, taking them by their arms; but they knew not that I healed them.

American Standard Version (ASV)
Yet I taught Ephraim to walk; I took them on my arms; but they knew not that I healed them.

Bible in Basic English (BBE)
But I was guiding Ephraim's footsteps; I took them up in my arms, but they were not conscious that I was ready to make them well.

Darby English Bible (DBY)
And I it was that taught Ephraim to walk, -- He took them upon his arms, -- but they knew not that I healed them.

World English Bible (WEB)
Yet I taught Ephraim to walk. I took them by his arms; But they didn't know that I healed them.

Young's Literal Translation (YLT)
And I have caused Ephraim to go on foot, Taking them by their arms, And they have not known that I strengthened them.

I
וְאָנֹכִ֤יwĕʾānōkîveh-ah-noh-HEE
taught
תִרְגַּ֙לְתִּי֙tirgaltiyteer-ɡAHL-TEE
Ephraim
לְאֶפְרַ֔יִםlĕʾeprayimleh-ef-RA-yeem
taking
go,
to
also
קָחָ֖םqāḥāmka-HAHM
them
by
עַלʿalal
arms;
their
זְרֽוֹעֹתָ֑יוzĕrôʿōtāywzeh-roh-oh-TAV
but
they
knew
וְלֹ֥אwĕlōʾveh-LOH
not
יָדְע֖וּyodʿûyode-OO
that
כִּ֥יkee
I
healed
them.
רְפָאתִֽים׃rĕpāʾtîmreh-fa-TEEM

Cross Reference

ద్వితీయోపదేశకాండమ 1:31
ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.

యిర్మీయా 30:17
​వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

నిర్గమకాండము 15:26
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలు

అపొస్తలుల కార్యములు 13:18
యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.

హొషేయ 14:4
వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.

హొషేయ 7:15
​నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు.

హొషేయ 7:1
నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.

హొషేయ 2:8
దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను.

యిర్మీయా 8:22
గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?

యెషయా గ్రంథము 63:9
వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

యెషయా గ్రంథము 46:3
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

యెషయా గ్రంథము 30:26
యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

యెషయా గ్రంథము 1:2
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

ద్వితీయోపదేశకాండమ 32:10
అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.

ద్వితీయోపదేశకాండమ 8:2
మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.

సంఖ్యాకాండము 11:11
కాగా మోషే యెహోవాతో యిట్లనెనునీవేల నీ సేవకుని బాధిం చితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జను లందరి భారమును నామీద పెట్టనేల?

నిర్గమకాండము 23:25
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.

నిర్గమకాండము 19:4
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.