Galatians 5:5
ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.
Galatians 5:5 in Other Translations
King James Version (KJV)
For we through the Spirit wait for the hope of righteousness by faith.
American Standard Version (ASV)
For we through the Spirit by faith wait for the hope of righteousness.
Bible in Basic English (BBE)
For we through the Spirit by faith are waiting for the hope of righteousness.
Darby English Bible (DBY)
For we, by [the] Spirit, on the principle of faith, await the hope of righteousness.
World English Bible (WEB)
For we, through the Spirit, by faith wait for the hope of righteousness.
Young's Literal Translation (YLT)
for we by the Spirit, by faith, a hope of righteousness do wait for,
| For | ἡμεῖς | hēmeis | ay-MEES |
| we | γὰρ | gar | gahr |
| through the Spirit | πνεύματι | pneumati | PNAVE-ma-tee |
| for wait | ἐκ | ek | ake |
| the hope | πίστεως | pisteōs | PEE-stay-ose |
| of righteousness | ἐλπίδα | elpida | ale-PEE-tha |
| by | δικαιοσύνης | dikaiosynēs | thee-kay-oh-SYOO-nase |
| faith. | ἀπεκδεχόμεθα | apekdechometha | ah-pake-thay-HOH-may-tha |
Cross Reference
1 థెస్సలొనీకయులకు 1:10
దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.
ఫిలిప్పీయులకు 3:9
క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
రోమీయులకు 8:23
అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
కీర్తనల గ్రంథము 130:5
యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
కీర్తనల గ్రంథము 62:5
నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
కీర్తనల గ్రంథము 25:5
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
ఆదికాండము 49:18
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
తీతుకు 2:13
అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెన
2 తిమోతికి 4:8
ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
2 థెస్సలొనీకయులకు 3:5
దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
ఎఫెసీయులకు 2:18
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
రోమీయులకు 5:21
ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.
హొషేయ 12:6
కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగ వలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవునియందు నమి్మక నుంచుము.
విలాపవాక్యములు 3:25
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
కీర్తనల గ్రంథము 25:3
నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
యోహాను సువార్త 16:8
ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.