ఎజ్రా 8:29
కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారి యెదుట, వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.
Watch | שִׁקְד֣וּ | šiqdû | sheek-DOO |
ye, and keep | וְשִׁמְר֗וּ | wĕšimrû | veh-sheem-ROO |
them, until | עַֽד | ʿad | ad |
ye weigh | תִּשְׁקְל֡וּ | tišqĕlû | teesh-keh-LOO |
before them | לִפְנֵי֩ | lipnēy | leef-NAY |
the chief | שָׂרֵ֨י | śārê | sa-RAY |
priests the of | הַכֹּֽהֲנִ֧ים | hakkōhănîm | ha-koh-huh-NEEM |
and the Levites, | וְהַלְוִיִּ֛ם | wĕhalwiyyim | veh-hahl-vee-YEEM |
chief and | וְשָׂרֵֽי | wĕśārê | veh-sa-RAY |
of the fathers | הָאָב֥וֹת | hāʾābôt | ha-ah-VOTE |
of Israel, | לְיִשְׂרָאֵ֖ל | lĕyiśrāʾēl | leh-yees-ra-ALE |
at Jerusalem, | בִּירֽוּשָׁלִָ֑ם | bîrûšālāim | bee-roo-sha-la-EEM |
chambers the in | הַלִּשְׁכ֖וֹת | halliškôt | ha-leesh-HOTE |
of the house | בֵּ֥ית | bêt | bate |
of the Lord. | יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
ఎజ్రా 8:33
నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:20
కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.
మార్కు సువార్త 13:34
ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)
అపొస్తలుల కార్యములు 20:31
కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మను ష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.
2 తిమోతికి 4:5
అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.