Index
Full Screen ?
 

ఎజ్రా 4:20

Ezra 4:20 in Tamil తెలుగు బైబిల్ ఎజ్రా ఎజ్రా 4

ఎజ్రా 4:20
మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లు చుండెను.

There
have
been
וּמַלְכִ֣יןûmalkînoo-mahl-HEEN
mighty
תַּקִּיפִ֗יןtaqqîpînta-kee-FEEN
kings
הֲווֹ֙hăwôhuh-VOH
also
over
עַלʿalal
Jerusalem,
יְר֣וּשְׁלֶ֔םyĕrûšĕlemyeh-ROO-sheh-LEM
which
have
ruled
וְשַׁ֨לִּיטִ֔יןwĕšallîṭînveh-SHA-lee-TEEN
over
all
בְּכֹ֖לbĕkōlbeh-HOLE
beyond
countries
עֲבַ֣רʿăbaruh-VAHR
the
river;
נַֽהֲרָ֑הnahărâna-huh-RA
and
toll,
וּמִדָּ֥הûmiddâoo-mee-DA
tribute,
בְל֛וֹbĕlôveh-LOH
custom,
and
וַֽהֲלָ֖ךְwahălākva-huh-LAHK
was
paid
מִתְיְהֵ֥בmityĕhēbmeet-yeh-HAVE
unto
them.
לְהֽוֹן׃lĕhônleh-HONE

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 4:21
నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.

ఆదికాండము 15:18
ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

కీర్తనల గ్రంథము 72:8
సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18:3
సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

ఎజ్రా 7:24
మరియు యాజ కులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

ఎజ్రా 4:16
​కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.

ఎజ్రా 4:13
​కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:7
ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 17:11
ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడు వేల ఏడు వందల గొఱ్ఱ పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేక పోతులను తెచ్చుచు వచ్చిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 9:23
​దేవుడు సొలొ మోనుయొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 9:14
​అరబీదేశపు రాజులందరును దేశాధిపతు లును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19:19
తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటినుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18:13
దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18:6
తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.

రాజులు మొదటి గ్రంథము 4:24
యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.

యెహొషువ 1:3
​నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.

Chords Index for Keyboard Guitar