Ezekiel 27:23
హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.
Ezekiel 27:23 in Other Translations
King James Version (KJV)
Haran, and Canneh, and Eden, the merchants of Sheba, Asshur, and Chilmad, were thy merchants.
American Standard Version (ASV)
Haran and Canneh and Eden, the traffickers of Sheba, Asshur `and' Chilmad, were thy traffickers.
Bible in Basic English (BBE)
Haran and Canneh and Eden, the traders of Asshur and all the Medes:
Darby English Bible (DBY)
Haran, and Canneh, and Eden, the merchants of Sheba, Asshur, and Chilmad traded with thee:
World English Bible (WEB)
Haran and Canneh and Eden, the traffickers of Sheba, Asshur [and] Chilmad, were your traffickers.
Young's Literal Translation (YLT)
Haran, and Canneh, and Eden, merchants of Sheba, Asshur -- Chilmad -- `are' thy merchants,
| Haran, | חָרָ֤ן | ḥārān | ha-RAHN |
| and Canneh, | וְכַנֵּה֙ | wĕkannēh | veh-ha-NAY |
| and Eden, | וָעֶ֔דֶן | wāʿeden | va-EH-den |
| the merchants | רֹכְלֵ֖י | rōkĕlê | roh-heh-LAY |
| Sheba, of | שְׁבָ֑א | šĕbāʾ | sheh-VA |
| Asshur, | אַשּׁ֖וּר | ʾaššûr | AH-shoor |
| and Chilmad, | כִּלְמַ֥ד | kilmad | keel-MAHD |
| were thy merchants. | רֹכַלְתֵּֽךְ׃ | rōkaltēk | roh-hahl-TAKE |
Cross Reference
రాజులు రెండవ గ్రంథము 19:12
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదె నీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించు కొనిరా?
యెషయా గ్రంథము 37:12
నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
ఆమోసు 1:5
దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసు లను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఆదికాండము 10:22
షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
అపొస్తలుల కార్యములు 7:4
అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవు
ఆమోసు 6:2
కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.
యెషయా గ్రంథము 10:9
కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
యెషయా గ్రంథము 7:20
ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.
యెషయా గ్రంథము 7:18
ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
కీర్తనల గ్రంథము 83:8
అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)
యోబు గ్రంథము 1:15
ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.
సంఖ్యాకాండము 24:22
అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా?
ఆదికాండము 32:22
ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.
ఆదికాండము 25:3
యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
ఆదికాండము 12:4
యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
ఆదికాండము 11:31
తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
ఆదికాండము 10:10
షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
ఆదికాండము 2:8
దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.