యెహెజ్కేలు 20:20
నేను మీ దేవుడనైన యెహోవా నని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.
And hallow | וְאֶת | wĕʾet | veh-ET |
my sabbaths; | שַׁבְּתוֹתַ֖י | šabbĕtôtay | sha-beh-toh-TAI |
be shall they and | קַדֵּ֑שׁוּ | qaddēšû | ka-DAY-shoo |
a sign | וְהָי֤וּ | wĕhāyû | veh-ha-YOO |
between | לְאוֹת֙ | lĕʾôt | leh-OTE |
know may ye that you, and me | בֵּינִ֣י | bênî | bay-NEE |
that | וּבֵֽינֵיכֶ֔ם | ûbênêkem | oo-vay-nay-HEM |
I | לָדַ֕עַת | lādaʿat | la-DA-at |
Lord the am | כִּ֛י | kî | kee |
your God. | אֲנִ֥י | ʾănî | uh-NEE |
יְהוָ֖ה | yĕhwâ | yeh-VA | |
אֱלֹהֵיכֶֽם׃ | ʾĕlōhêkem | ay-loh-hay-HEM |
Cross Reference
యిర్మీయా 17:22
విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించి నట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.
యెహెజ్కేలు 20:12
మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినము లను వారికి సూచనగా నేను నియమించితిని.
నిర్గమకాండము 20:11
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
నిర్గమకాండము 31:13
మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.
నెహెమ్యా 13:15
ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమి్మనవారిని గద్దించితిని.
యెషయా గ్రంథము 58:13
నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల
యిర్మీయా 17:24
మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెనుమీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుం డిన యెడల
యిర్మీయా 17:27
అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మ ములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరు లను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
యెహెజ్కేలు 44:24
జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతి దినములను ఆచరించుదురు.