అపొస్తలుల కార్యములు 4:20 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 4 అపొస్తలుల కార్యములు 4:20

Acts 4:20
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

Acts 4:19Acts 4Acts 4:21

Acts 4:20 in Other Translations

King James Version (KJV)
For we cannot but speak the things which we have seen and heard.

American Standard Version (ASV)
for we cannot but speak the things which we saw and heard.

Bible in Basic English (BBE)
For it is not possible for us to keep from saying what we have seen and have knowledge of.

Darby English Bible (DBY)
for as for us *we* cannot refrain from speaking of the things which we have seen and heard.

World English Bible (WEB)
for we can't help telling the things which we saw and heard."

Young's Literal Translation (YLT)
for we cannot but speak what we did see and hear.'

For
οὐouoo
we
δυνάμεθαdynamethathyoo-NA-may-tha
cannot
γὰρgargahr

ἡμεῖςhēmeisay-MEES
but
haa
speak
εἴδομενeidomenEE-thoh-mane
which
things
the
καὶkaikay
we
have
seen
ἠκούσαμενēkousamenay-KOO-sa-mane
and
μὴmay
heard.
λαλεῖνlaleinla-LEEN

Cross Reference

అపొస్తలుల కార్యములు 22:15
నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.

యిర్మీయా 20:9
​​ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

అపొస్తలుల కార్యములు 5:32
మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

యెహెజ్కేలు 3:11
బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.

సంఖ్యాకాండము 23:20
ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.

యోబు గ్రంథము 32:18
నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

యిర్మీయా 1:7
​యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.

యిర్మీయా 1:17
కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.

యిర్మీయా 4:19
నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?

మీకా 3:8
​నేనైతే యాకోబు సంతతివారికి తమ దోష మును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.

1 కొరింథీయులకు 9:16
నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

1 యోహాను 1:1
జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

సంఖ్యాకాండము 22:38
అందుకు బిలాముఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.

హెబ్రీయులకు 2:3
ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

సమూయేలు రెండవ గ్రంథము 23:2
యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడుఆయన వాక్కు నా నోట ఉన్నది.

యిర్మీయా 6:11
కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸°వనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడె దరు.

యెహెజ్కేలు 3:14
ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.

లూకా సువార్త 1:2
ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

అపొస్తలుల కార్యములు 1:8
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును

అపొస్తలుల కార్యములు 2:4
అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపొస్తలుల కార్యములు 2:32
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి3 మేమందరము సాక్షులము.

అపొస్తలుల కార్యములు 3:15
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

అపొస్తలుల కార్యములు 10:39
ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.

అపొస్తలుల కార్యములు 17:16
పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

అపొస్తలుల కార్యములు 18:5
సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.

అపొస్తలుల కార్యములు 1:22
ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.