Acts 3:1
పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,
Acts 3:1 in Other Translations
King James Version (KJV)
Now Peter and John went up together into the temple at the hour of prayer, being the ninth hour.
American Standard Version (ASV)
Now Peter and John were going up into the temple at the hour of prayer, `being' the ninth `hour'.
Bible in Basic English (BBE)
Now Peter and John were going up to the Temple at the ninth hour, the hour of prayer;
Darby English Bible (DBY)
And Peter and John went up together into the temple at the hour of prayer, [which is] the ninth [hour];
World English Bible (WEB)
Peter and John were going up into the temple at the hour of prayer, the ninth hour{3:00 PM}.
Young's Literal Translation (YLT)
And Peter and John were going up at the same time to the temple, at the hour of the prayer, the ninth `hour',
| Now | ἐπὶ | epi | ay-PEE |
| Peter | τὸ | to | toh |
| and | αὐτό | auto | af-TOH |
| John | δὲ | de | thay |
| up went | Πέτρος | petros | PAY-trose |
| together | καὶ | kai | kay |
| Ἰωάννης | iōannēs | ee-oh-AN-nase | |
| ἀνέβαινον | anebainon | ah-NAY-vay-none | |
| into | εἰς | eis | ees |
| the | τὸ | to | toh |
| temple | ἱερὸν | hieron | ee-ay-RONE |
| at | Ἐπὶ | epi | ay-PEE |
| the | τὴν | tēn | tane |
| hour | ὥραν | hōran | OH-rahn |
| of | τῆς | tēs | tase |
| prayer, | προσευχῆς | proseuchēs | prose-afe-HASE |
| being the | τὴν | tēn | tane |
| ninth | ἐννάτην | ennatēn | ane-NA-tane |
Cross Reference
కీర్తనల గ్రంథము 55:17
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
అపొస్తలుల కార్యములు 4:13
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
అపొస్తలుల కార్యములు 2:46
మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
యోహాను సువార్త 13:23
ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను
యోహాను సువార్త 20:2
గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.
యోహాను సువార్త 21:7
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడుఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
అపొస్తలుల కార్యములు 5:25
అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా
అపొస్తలుల కార్యములు 8:14
సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.
అపొస్తలుల కార్యములు 10:3
పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.
అపొస్తలుల కార్యములు 10:30
అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలు కొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెద
లూకా సువార్త 24:53
యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.
లూకా సువార్త 22:8
యేసు పేతురును యోహానును చూచిమీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
లూకా సువార్త 1:10
ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
మత్తయి సువార్త 26:37
పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.
మత్తయి సువార్త 17:1
ఆరు దినములైన తరువాత యేసు పేతురును... యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.
దానియేలు 6:10
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
సంఖ్యాకాండము 28:4
వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.
రాజులు మొదటి గ్రంథము 18:36
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
దానియేలు 9:21
నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.
లూకా సువార్త 23:44
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
యోహాను సువార్త 21:18
యేసు నా గొఱ్ఱలను మేపుము. నీవు ¸°వనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.
గలతీయులకు 2:9
స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
నిర్గమకాండము 29:39
సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.