యెహెజ్కేలు 34:26 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెహెజ్కేలు యెహెజ్కేలు 34 యెహెజ్కేలు 34:26

Ezekiel 34:26
వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును,

Ezekiel 34:25Ezekiel 34Ezekiel 34:27

Ezekiel 34:26 in Other Translations

King James Version (KJV)
And I will make them and the places round about my hill a blessing; and I will cause the shower to come down in his season; there shall be showers of blessing.

American Standard Version (ASV)
And I will make them and the places round about my hill a blessing; and I will cause the shower to come down in its season; there shall be showers of blessing.

Bible in Basic English (BBE)
And I will give the rain at the right time, and I will make the shower come down at the right time; there will be showers of blessing.

Darby English Bible (DBY)
And I will make them and the places round about my hill a blessing; and I will cause the shower to come down in its season: there shall be showers of blessing.

World English Bible (WEB)
I will make them and the places round about my hill a blessing; and I will cause the shower to come down in its season; there shall be showers of blessing.

Young's Literal Translation (YLT)
And I have given them, and the suburbs of my hill, a blessing, And caused the shower to come down in its season, Showers of blessing they are.

And
I
will
make
וְנָתַתִּ֥יwĕnātattîveh-na-ta-TEE
about
round
places
the
and
them
אוֹתָ֛םʾôtāmoh-TAHM
my
hill
וּסְבִיב֥וֹתûsĕbîbôtoo-seh-vee-VOTE
blessing;
a
גִּבְעָתִ֖יgibʿātîɡeev-ah-TEE
shower
the
cause
will
I
and
בְּרָכָ֑הbĕrākâbeh-ra-HA
to
come
down
וְהוֹרַדְתִּ֤יwĕhôradtîveh-hoh-rahd-TEE
season;
his
in
הַגֶּ֙שֶׁם֙haggešemha-ɡEH-SHEM
there
shall
be
בְּעִתּ֔וֹbĕʿittôbeh-EE-toh
showers
גִּשְׁמֵ֥יgišmêɡeesh-MAY
of
blessing.
בְרָכָ֖הbĕrākâveh-ra-HA
יִֽהְיֽוּ׃yihĕyûYEE-heh-YOO

Cross Reference

మలాకీ 3:10
నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

ఆదికాండము 12:2
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

లేవీయకాండము 26:4
మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,

ద్వితీయోపదేశకాండమ 28:12
యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు

కీర్తనల గ్రంథము 68:9
దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.

యెషయా గ్రంథము 44:3
నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

జెకర్యా 8:13
యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పద మగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.

మీకా 4:1
అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వ తముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.

యెషయా గ్రంథము 19:24
ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.

జెకర్యా 8:23
​సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొనిదేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

యెహెజ్కేలు 20:40
నిజముగా ఇశ్రా యేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.

కీర్తనల గ్రంథము 2:6
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను

కీర్తనల గ్రంథము 68:16
శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.

కీర్తనల గ్రంథము 132:14
ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను

కీర్తనల గ్రంథము 133:3
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

యెషయా గ్రంథము 2:2
అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యెషయా గ్రంథము 32:15
అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

యెషయా గ్రంథము 32:20
సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

యెషయా గ్రంథము 56:7
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.

ద్వితీయోపదేశకాండమ 11:13
​కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల