యెహెజ్కేలు 24:8 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెహెజ్కేలు యెహెజ్కేలు 24 యెహెజ్కేలు 24:8

Ezekiel 24:8
కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.

Ezekiel 24:7Ezekiel 24Ezekiel 24:9

Ezekiel 24:8 in Other Translations

King James Version (KJV)
That it might cause fury to come up to take vengeance; I have set her blood upon the top of a rock, that it should not be covered.

American Standard Version (ASV)
That it may cause wrath to come up to take vengeance, I have set her blood upon the bare rock, that it should not be covered.

Bible in Basic English (BBE)
In order that it might make wrath come up to give punishment, she has put her blood on the open rock, so that it may not be covered.

Darby English Bible (DBY)
That it might cause fury to come up to execute vengeance, I have set her blood upon the bare rock, that it should not be covered.

World English Bible (WEB)
That it may cause wrath to come up to take vengeance, I have set her blood on the bare rock, that it should not be covered.

Young's Literal Translation (YLT)
To cause fury to come up to take vengeance, I have put her blood on a clear place of a rock -- not to be covered.

That
it
might
cause
fury
לְהַעֲל֤וֹתlĕhaʿălôtleh-ha-uh-LOTE
up
come
to
חֵמָה֙ḥēmāhhay-MA
to
take
לִנְקֹ֣םlinqōmleen-KOME
vengeance;
נָקָ֔םnāqāmna-KAHM
I
have
set
נָתַ֥תִּיnātattîna-TA-tee

אֶתʾetet
her
blood
דָּמָ֖הּdāmāhda-MA
upon
עַלʿalal
the
top
צְחִ֣יחַṣĕḥîaḥtseh-HEE-ak
rock,
a
of
סָ֑לַעsālaʿSA-la
that
it
should
not
לְבִלְתִּ֖יlĕbiltîleh-veel-TEE
be
covered.
הִכָּסֽוֹת׃hikkāsôthee-ka-SOTE

Cross Reference

ద్వితీయోపదేశకాండమ 32:21
వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

ప్రకటన గ్రంథము 18:16
అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము

ప్రకటన గ్రంథము 18:5
దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

ప్రకటన గ్రంథము 17:1
ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురుదేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచె దను;

1 కొరింథీయులకు 4:5
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృద యములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

మత్తయి సువార్త 7:2
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

యెహెజ్కేలు 23:45
​అయితే వ్యభిచారిణు లకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.

యెహెజ్కేలు 22:30
నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

యెహెజ్కేలు 16:37
​నీవు సంభోగించిన నీ విట కాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.

యెహెజ్కేలు 8:17
అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.

యెహెజ్కేలు 5:13
నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

యిర్మీయా 22:8
అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా

యిర్మీయా 15:1
అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.

యిర్మీయా 7:20
అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

యిర్మీయా 7:18
నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణ ములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:16
పెందలకడ లేచి పంపుచువచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:25
​వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఈ స్థలముమీద మితి లేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.

రాజులు రెండవ గ్రంథము 22:17
ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొను చున్నది.

ద్వితీయోపదేశకాండమ 29:22
కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి