1 Timothy 6:6
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
1 Timothy 6:6 in Other Translations
King James Version (KJV)
But godliness with contentment is great gain.
American Standard Version (ASV)
But godliness with contentment is great gain:
Bible in Basic English (BBE)
But true faith, with peace of mind, is of great profit:
Darby English Bible (DBY)
But piety with contentment *is* great gain.
World English Bible (WEB)
But godliness with contentment is great gain.
Young's Literal Translation (YLT)
but it is great gain -- the piety with contentment;
| But | ἔστιν | estin | A-steen |
| δὲ | de | thay | |
| godliness | πορισμὸς | porismos | poh-ree-SMOSE |
| with | μέγας | megas | MAY-gahs |
| contentment | ἡ | hē | ay |
| is | εὐσέβεια | eusebeia | afe-SAY-vee-ah |
| great | μετὰ | meta | may-TA |
| gain. | αὐταρκείας· | autarkeias | af-tahr-KEE-as |
Cross Reference
హెబ్రీయులకు 13:5
ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
1 తిమోతికి 6:8
కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
1 తిమోతికి 4:8
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
ఫిలిప్పీయులకు 4:11
నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.
సామెతలు 16:8
అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
సామెతలు 15:16
నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
కీర్తనల గ్రంథము 37:16
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
ఫిలిప్పీయులకు 1:21
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
రోమీయులకు 8:28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
లూకా సువార్త 12:31
మీరైతే ఆయన రాజ్యమును1 వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.
లూకా సువార్త 3:14
సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయ కయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 6:32
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
2 కొరింథీయులకు 4:17
మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
రోమీయులకు 5:3
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
సామెతలు 8:18
ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.
సామెతలు 3:13
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 84:11
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
నిర్గమకాండము 2:21
మోషేఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.