1 పేతురు 2:2 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ 1 పేతురు 1 పేతురు 2 1 పేతురు 2:2

1 Peter 2:2
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

1 Peter 2:11 Peter 21 Peter 2:3

1 Peter 2:2 in Other Translations

King James Version (KJV)
As newborn babes, desire the sincere milk of the word, that ye may grow thereby:

American Standard Version (ASV)
as newborn babes, long for the spiritual milk which is without guile, that ye may grow thereby unto salvation;

Bible in Basic English (BBE)
Be full of desire for the true milk of the word, as babies at their mothers' breasts, so that you may go on to salvation;

Darby English Bible (DBY)
as newborn babes desire earnestly the pure mental milk of the word, that by it ye may grow up to salvation,

World English Bible (WEB)
as newborn babes, long for the pure milk of the Word, that you may grow thereby,

Young's Literal Translation (YLT)
as new-born babes the word's pure milk desire ye, that in it ye may grow,

As
ὡςhōsose
newborn
ἀρτιγέννηταartigennētaar-tee-GANE-nay-ta
babes,
βρέφηbrephēVRAY-fay
desire
τὸtotoh
the
sincere
λογικὸνlogikonloh-gee-KONE
milk
ἄδολονadolonAH-thoh-lone
the
of
γάλαgalaGA-la
word,
ἐπιποθήσατεepipothēsateay-pee-poh-THAY-sa-tay
that
ἵναhinaEE-na
ye
may
grow
ἐνenane
thereby:
αὐτῷautōaf-TOH

αὐξηθῆτεauxēthēteaf-ksay-THAY-tay

Cross Reference

హెబ్రీయులకు 5:12
కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.

ఎఫెసీయులకు 4:15
ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

మత్తయి సువార్త 18:3
మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

1 కొరింథీయులకు 3:1
సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

2 పేతురు 3:18
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

2 థెస్సలొనీకయులకు 1:3
సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.

1 కొరింథీయులకు 14:20
సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.

మార్కు సువార్త 10:15
చిన్నబిడ్డ వలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి

హొషేయ 6:3
​యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహో వానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

రోమీయులకు 6:4
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.

సామెతలు 4:18
పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

1 పేతురు 1:23
ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

కీర్తనల గ్రంథము 19:7
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

సమూయేలు రెండవ గ్రంథము 23:5
నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

యోబు గ్రంథము 17:9
అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

ఎఫెసీయులకు 2:21
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

మలాకీ 4:2
అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

హొషేయ 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.

హొషేయ 14:7
​అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.