Mark 13:20
ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
And | καὶ | kai | kay |
except | εἰ | ei | ee |
μὴ | mē | may | |
that the Lord | κύριος | kyrios | KYOO-ree-ose |
shortened had | ἐκολόβωσεν | ekolobōsen | ay-koh-LOH-voh-sane |
those | τὰς | tas | tahs |
days, | ἡμέρας | hēmeras | ay-MAY-rahs |
no | οὐκ | ouk | ook |
ἂν | an | an | |
flesh | ἐσώθη | esōthē | ay-SOH-thay |
πᾶσα | pasa | PA-sa | |
saved: be should | σάρξ· | sarx | SAHR-ks |
but | ἀλλὰ | alla | al-LA |
for | διὰ | dia | thee-AH |
the | τοὺς | tous | toos |
elect's | ἐκλεκτοὺς | eklektous | ake-lake-TOOS |
sake, whom | οὓς | hous | oos |
chosen, hath he | ἐξελέξατο | exelexato | ayks-ay-LAY-ksa-toh |
he hath shortened | ἐκολόβωσεν | ekolobōsen | ay-koh-LOH-voh-sane |
the | τὰς | tas | tahs |
days. | ἡμέρας | hēmeras | ay-MAY-rahs |
Cross Reference
Isaiah 65:8
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులుఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లు వారినిబట్టి నేనాలాగే చేసెదను.
Zechariah 13:8
దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.
Matthew 24:22
ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
Romans 11:28
సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.
Isaiah 1:9
సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన ముగా ఉందుము.
Isaiah 6:13
దానిలో పదియవ భాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.
Romans 11:5
ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.
Romans 11:23
వారును తమ అవిశ్వాస ములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.