Job 27:19
వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
Job 27:19 in Other Translations
King James Version (KJV)
The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he is not.
American Standard Version (ASV)
He lieth down rich, but he shall not be gathered `to his fathers'; He openeth his eyes, and he is not.
Bible in Basic English (BBE)
He goes to rest full of wealth, but does so for the last time: on opening his eyes, he sees it there no longer.
Darby English Bible (DBY)
He lieth down rich, but will do so no more; he openeth his eyes, and he is not.
Webster's Bible (WBT)
The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he is not.
World English Bible (WEB)
He lies down rich, but he shall not do so again. He opens his eyes, and he is not.
Young's Literal Translation (YLT)
Rich he lieth down, and he is not gathered, His eyes he hath opened, and he is not.
| The rich man | עָשִׁ֣יר | ʿāšîr | ah-SHEER |
| down, lie shall | יִ֭שְׁכַּב | yiškab | YEESH-kahv |
| but he shall not | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
| gathered: be | יֵאָסֵ֑ף | yēʾāsēp | yay-ah-SAFE |
| he openeth | עֵינָ֖יו | ʿênāyw | ay-NAV |
| his eyes, | פָּקַ֣ח | pāqaḥ | pa-KAHK |
| and he is not. | וְאֵינֶֽנּוּ׃ | wĕʾênennû | veh-ay-NEH-noo |
Cross Reference
Jeremiah 8:2
వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
Job 24:24
వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
Matthew 23:37
యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
Matthew 3:12
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
Psalm 73:19
క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
Psalm 58:9
మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు,
Job 30:23
మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.
Job 21:30
అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
Job 21:23
ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను
Job 20:7
తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారువారేమైరని యడుగుదురు.
Job 14:12
ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
Job 14:10
అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?
Job 8:22
అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును.ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
Job 7:8
నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు.నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
Genesis 49:10
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.